స్తుతి పాడుటకె బ్రతికించిన - sthuthi padutake brathikinchina song lyrics

స్తుతి పాడుటకె బ్రతికించిన 
జీవన దాతవు నీవే నయా 
ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లి వలె నను ఓదార్చిన 
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్య 
జీవిత కాలమంతా  - ఆధారం నీవెనయ్యా 
నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరుతును

ప్రాణ భయమును తొలగించి నావు 
ప్రాకారములను స్థాపించి నావు 
సర్వజనులలో నీ మహిమ వివరింప 
దీర్ఘఆయువు తో నను నింపినావు 
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై 
తలచిన ప్రతి క్షణమున నూతన కృప నిచ్చెను (2) 
                                                    " స్తుతి పాడుటకె "

నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు 
కనుమరుగాయెను నా దుఃఖ దినములు 
కృపలను పొంది నీ కాడి మోయుటకు 
లోకములోనుండి ఏర్పరిచినావు 
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభ ప్రధమై 
నీ నిత్య రాజ్యమునకు నిరీక్షణ కలిగించెను (2)
                                                   " స్తుతి పాడుటకె "

హేతువు లేకయే ప్రేమించినావు 
వేడుకగా ఇలా నను మార్చినావు       
కలవరమొందిన వేళలయందు 
నా చేయి విడువక నడిపించినావు 
నీ ప్రేమ మధుర్యమే - నా నోట స్తుతి గానమై 
నిలిచిన ప్రతి క్షణమున పాడెను సెలయెరులా (2) 
                                                  " స్తుతి పాడుటకె " 
 
     

  

Comments

Popular Posts