శుద్ధ హృదయం కలుగజేయుము - shuddha hrudhayam song lyrics

శుద్ధ హృదయం కలుగ జేయుము (2) 
నాలోనా.. నాలోనా .. (2)                    " శుద్ధ " 


నీ వాత్సల్యం నీ బాహుళ్యం నీ కృపా కనికరం చూపించుము  (2) 
పాపము చేసాను దోషి నై యున్నాను (2) 
తెలిసియున్నది నా అతి క్రమమే 
తెలిసి యున్నవి నా పాపములే (2) 
నీ సన్నిధిలో నా పాపములే 
ఒప్పుకుందునయా (2)                      " శుద్ధ " 


నీ జ్ఞానమును నీ సత్యమును
నా అంతర్యములో పుట్టించుము    (2) 
ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2) 
కలుగజేయుము నా హృదయములో (4) 
నీ సన్నిధిలో పరిశుద్దాత్మతో
 నన్ను నింపుమయా (2)                   " శుద్ధ " 



Comments

Popular Posts