రాజా నీ సన్నిధిలో - raja nee sannidhi lo song lyrics

రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా 
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా 
నేనుండాలేనయ్య నే బ్రతుకాలేనయ్యా 
నీవే లేకుండా నేనుండాలేనయ్యా  
నీ తోడే లేకుండా నే బ్రతుకా లేనయ్యా 

నీ సన్నిధానము లో సంపూర్ణ సంతోషం 
ఆరాధించుకునే విలువైన అవకాశం 
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును   
నీవే రాకపోతే నేనే మై పొదునో  

ఒంటరి పోరు నన్ను విసిగించిన 
మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా 
ఒంటరి వాడే వేయి మంది అన్నావు 
నేనున్నాను లే భయపడకు అన్నావు 
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా 


ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా 
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిసొస్తా 
విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము 
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము 
నిన్ను మించిన దేవుడే లేదయ్యా 
.

Comments

Popular Posts