ప్రేమే శాశ్వతమైన - preme sasvathamaina song lyrics

ప్రేమేశాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు 
మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే 
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యని వలెనే 
నిరంతరం నీ మాటతో ప్రకాశింప చేసేదవు 

అమరమైన నీ చరితం  విమలమైన నీ రూధిరం 
ఆత్మీయముగా ఉత్తేజ పరచిన పరివర్తన క్షేత్రము 
ఇన్నాళ్లుగా నను స్నేహించి  ఇంతగా ఫలింప చేసితివి 
ఈ స్వర సంపధనంతటితో అభినయించి నే పాడేదను 
ఉండలేను బ్రతుక లేను నీ తోడు లేకుండా 
నీ నీడ లేకుండా....             " ప్రేమేశాశ్వతమైన "


కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో 
ఖడ్గము కంటే బలమైన నీ వాక్యం ధైర్యామిచ్చే నాశ్రమలో 
కరువు సీమలో సిరులొలి కించెను నీ  వాక్య ప్రవహము 
గగణము చీల్చి మా పైన దీవెన వర్షము కురిపించితివి 
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా 
వర్ణింప నా తరమా            " ప్రేమేశాశ్వతమైన " 



విధి రాసిన విషాద గీతం సమసి పోయే నీ దయతో 
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చి తివి
మమతల వంతెన దాటించి మహిమలో స్దాన మిచ్చితివి 
నీ రాజ్యములో జేస్టులతో యుగయుగములు నేప్రకాశించనా - నా పై ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు 
మరువలేను యేసయ్యా    " ప్రేమేశాశ్వతమైన " 

 

Comments

Popular Posts