పాడేద స్తుతి గానము - padedha sthuthi gaanamu song lyrics

పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము (2)
నీవే నా ప్రేమానురాగం - క్షణమైనా విడువని స్నేహం 
అతిశ్రేష్ఠుడా నా యేసయ్య               " పాడేద " 

ఇలనాకెవరు లేరనుకొనగా న దరి చేరితివే 
నేనమ్మిన వారే నను మరచినను మరువని దేవుడవు (2)
నీ ఆశలే నాలో చిగురించెను 
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకానందమే (2)    " పాడేద "

నా ప్రతి అనువును పరిశుద్ధ పరిచేను - నీ రుధిర ధారలే 
నీ దర్శనమే నను నిలిపినది ధరనిలో నీ కొరకే (2)
నీ చేతులో నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను (2)
నీ అభిషేకము పరమానందమే (2)    " పాడేద "

బలహీనత లో నను బలపరచి ధైర్యము నింపితివే 
నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి (2) 
యూదా గోత్రపు కోదమ సింహమా 
నీతో నిత్యము విజయ హాసమే (2)
నీ పరిచర్యలో మహిమానందమే (2)  " పాడేద "



Comments

Popular Posts