పాడనా మౌనముగానే - paadana mounamu gane song lyrics

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన 
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు (2)
యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరిచేనే (2) 

ప్రతి ఉదయమున నీ కృప లో నేను ఉల్లసింతునే 
నీ రక్తభిషేకము కడిగేనే నా ప్రాణాత్మ శరీరము ను (2) 
నా విమోచన గానము నీవే 
నా రక్షణ శృంగము నీవే (2)              " పాడనా "

దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే 
నీ ప్రశాంత పవనాలు అణిచనే నా వ్యామోహపు పొంగులన్నియు (2) 
నా ఓదార్పు నిధివి నీవే 
నా ఆనంద క్షేత్రము నీవే (2)             " పాడనా " 

నీ అలయమై నీ మహిమను నేను కప్పుకొంటి నే 
నీ తైలాభి షేకము నింపేనే నా అంతరంగమంతయును (2)
నా మానస వీణవు నీవే 
నా ఆరాధన పల్లకి నీవే (2)              " పాడనా " 







Comments

Popular Posts