ఓ సద్భక్తులరా - o sadbhakthulara song lyrics
ఓ సద్భక్తులారా లోక రక్షకుండు
బేత్లెహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సా హముతో
సర్వేశ్వావారుండు నరరూప మెత్తి
కన్యకు పుట్టి నేడు వేంచేసేన్
మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
ఓ దూత లారా యుత్సహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా నీకు స్తోత్ర మంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సహముతో
యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ
మీ వేళా స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య మాయే నర రూపు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి యుత్సహముతో
Comments