నూతన హృదయం - nuthana hrudhayam song lyrics

నూతన హృదయం నూతన స్వభావం 
నూతన ప్రారంభం నాకు దయచేయుము 
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను 
నలిగిన మనస్సును నూతన పరచుము   

యేసు నీవే నన్ను సృజియించిన వాడవు 
నా బలహీనతలన్నీ యెరిగియున్నావు 
రాతి గుండెను నాలో తీసివేయుము 
అతిమెత్తని హృదయము దయ చేయుము 

1)
జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని 
పాపములో భోగమును ఆశించి నే మోస పోతిని 
నా దేహం నా హృదయం 
వ్యసనముతో నే  నిండి పోయెను 
హీనముగా దిగజారి ఘోరముగా  నే  కృంగి పోతిని 

నిను విడిచి నే క్షణమైనా బ్రతుకలేక 
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను 
శుద్ధ జలమును నాపై వెదజల్లుము 
హిమము కంటెను తెల్లగా కడిగివెయిము 

2) 
నా పాపం అపరాధం 
నానుండి దూరము చేయుధువు అని
నా భయము అవమానము బిడియమును 
తొలగించి వేతువని 
నా గతము జ్ఞాపకము నీమదిలో ఇక దాచుకోవు అని 
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను 

నీ శరణు కోరు వారిని త్రోసివేయవు 
కృప గల మహా దేవ నన్ను మన్నించుము 
సదా కృతజ్ఞత స్థుతులు నీకే అర్పింతును 
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును 



Comments

Popular Posts