నూతన గీతము - nuthana geethamu ne padedha song lyrics
నూతన గీతము నే పాడేద మనోహరుడా యేసయ్య
నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను
సమర్పణతో సేవించెదను నిన్నే
సజీవుడనై ఆరాధింతును నిన్నే (2) " నూతన "
కొలువు చేసి ప్రేమించావు కోరదగినది ఏముంది నాలో
స్వార్ధమెరుగని సాత్వికుడా నీకు దాటెవ్వరు (2)
నీవే నా ప్రాణము నిను వీడి నేనుండలేను (2)
" నూతన "
కడలి తీరం కనబడని వేల కడలి కెరటాలు వేధించు వేళా
కరుణ మూర్తిగా దిగివచ్చిన నీకు సాటెవ్వరూ (2)
నీవే నా ధైర్యము - నీ కృపయే ఆధారము (2)
" నూతన "
మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు (2)
నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము (2)
" నూతన "
Comments