నీవే ఔషధం - neve aushadham song lyrics

ఈ వ్యాధి బాధలో  ప్రార్ధించుచున్నామయా 
నీవే నా దుర్గము .. నేవే నా ధైర్యము .. 
నీవే నా ఔషధం నీ రక్తమే ఔషధం 
నీ రెక్కల చాటున నేను దాగెదా (2) 

శ్వాసే భారమై - ఏమవుతుందోయని 
లోయలో భీతిల్లగా మాతో ఉన్నావని (2) 
నీ స్పర్శే చాలునయా  
నను బ్రతికింప చేయునయా (2)       " నీవే నా " 

బలము క్షీణమై నీరసమవుతుండగా 
ఈ స్థితిలో క్రీస్తు శక్తి పరిపూర్ణమగుతుందని (2) 
నీ కృపాయే చాలునయా 
నన్ను బలమంద జేయునయా (2)   " నేవే నా " 

ఈ వ్యాధి తీవ్ర మై ఏమవుతుందో యని 
నా కాల గతులన్ని నీ వశ మేయని (2)
నీ సంకల్పం మారదు 
ఇదియే నా ధైర్యము (2)                " నేవే నా " 

 నీవాశించిన ఫలము ఇంకా ఫలించలేదని 
ఖిన్నుడనై చేయు ఈ ప్రార్ధన 
దయతో మన్నించుమా (2) 
ఓ అవకాశమిచ్చి పొడిగించినా 
ఈ శేష జీవితం నీ కొరకే (2)          " నేవే నా " 

Comments

Popular Posts