నేను వెళ్లే మార్గము - nenu velle margamu song lyrics

నేను వెళ్లే మార్గము - నా యేసుకె తెలియును (2) 
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను (2) 

కడలేని కడలి తీరము ఎడబాయే కడకు నా బ్రతుకున (2) 
గురిలేని తరుణాన వెరువగ నా దరినే నిలిచేవ నాప్రభు (2)
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ (2) 
                                                          " నేను వెళ్లే " 

జలములలో బడినేను వెళ్లిన అవి నా మీద పారవు (2)
అగ్ని లో నేను నడచిన జ్వాలలు నను కాల్చ జాలవు (2)
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ (2) 
                                                           "నేను వెళ్లే " 

విశ్వాస నావ సాగిచు పయనించు సమయాన నా ప్రభు (2)
సాతాను సుడిగాలి రేపగా నాదరినే నిలిచేవా నా ప్రభు (2) 
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ (2) 
                                                          " నేను వెళ్లే " 

Comments

Popular Posts