నేను వెళ్లే మార్గము - nenu velle margamu song lyrics

నేను వెళ్లే మార్గము నా యేసుకె తెలియును 
శోధింప బడిన మీదట నేను సువర్ణమై మారెదను
హల్లెలూయా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్  " నేను " 

కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకున 
గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు
                                                   " నేను వెళ్లే " 

జలములలో బడినే వెళ్లినా అవి నా మీద పారవు 
అగ్ని లో నేను నడిచినా  జ్వాలలు నను కాల్చ జాలవు 
                                                  " నేను వెళ్లే " 

విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు 
సాతాను సుడిగాలి రెపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు
                                                  " నేను వెళ్లే " 

Comments

Popular Posts