నేనెప్పుడూ యెహోవాను - neneppudu yehovanu song lyrics

నేనెప్పుడూ యెహోవాను సన్ను తించెదన్ 
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) 
అంతా నా మేలుకే  - ఆరాధన యేసుకె
అంతా నా మంచికే ( తన చిత్త మునకు తల వంచితే ) (2)
ఆరాధన ఆపను స్తుతించుట మానను (2) 
స్తుతించుట ఆపను 

కన్నీళ్లే పానములైనా కఠిన ధుఃఖ బాధలైన 
స్థితి గతులే మారిన అవకాశం చేజారిన 
మారదు యేసు ప్రేమ .
నిత్యుడైన - నిత్యుడైన  తండ్రి ప్రేమ  (4) 

ఆస్థులన్నీ కోల్పోయినా కన్న వారే కనుమారుగైన
ఊపిరి బరువైన గుండేలే గుండేలే పగిలిన 
యెహోవా ఇచ్చెను యోహావా తీసుకొనెను (2) 
ఆయన నామమునకే స్తుతి  కలుగును గాక (2) 


అవమానం ఎంతైనా నా వారే కాదన్నా 
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశ మందునా ?
నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు (4) 

ఆశలే సమాధియైన వ్యాధి బాధ వెల్లువైన 
అధికారము కప్పుకొని రక్షణ కై ఆనందింతున్ 
నాదు మనసు నీ మీద ఆదుకొనగా ఓ నాధా 
పూర్ణ శాంతి నే పొంది నిన్నే నే కీర్తింతును (4) 

చదువులే రాకున్న ఓటమి పాలైన 
ఉద్యోగం లేకున్నా భూమికే బరువైన 
నా యెడల నీ తలుపులు ఎంతో ప్రియమములు (2) 
నీవుద్దేశించినది నిస్ఫలము కానేరదు (2) 

సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు 
సమస్తము సమకూడి మేలుకై జరుగును 
యేసుని స్వారూప్యము నేను పొందాలని (2) 
అనుమతించిన ఈ విలువైన సిలువకై (2)

నీవు చేయునది నాకిప్పుడు తెలియదు 
ఇక మీదట నేను తెలిసి కొందును 
ప్రస్తుతము సమస్తము ధుఃఖ కరమే (2) 
అభ్యసించిన నీతి సమాధాన ఫలమే (2) 





Comments

Popular Posts