నేనెందుకని నీ సొత్తుగా - nenendukani nee sothuga song lyrics

నేనెందుకని నీ సొత్తుగా మారితిని 
యేసయ్య నీ రక్తముచే కడుగబడినందున 
నీ అనాది ప్రణాళికలో - హర్షించేను నా హృదయసీమ 

నీ పరిచర్యను తుధముట్టించుటే నా నియమమాయెనే 
నీ సన్నిధిలో నీ పొందు కోరి - నీ స్నేహితుడనైతినే 
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును 
                                                      " నేనెందుకని " 

నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున  శ్రమలు సహించి నీ వారసుడనైతినే 
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును 
                                                     " నేనెందుకని " 

నీలో నేనుండటే నాలో నీవుండటే నా ఆత్మీయ అనుభవమే - పరిశుద్ధాత్ముని అభిషేకము తో - నే పరిపూర్ణత చెందేద
ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వర్ణింతును 
                                                     " నేనెందుకని " 

Comments

Popular Posts