నీవే కృపాధారము - neeve krupaadharamu song lyrics
నీవే కృపాధారము త్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా (2)
నూతన బలమును నవనూతన కృపను (2
నేటివరకు దయచేయుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా
ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయ పురమైన నీలో
ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి (2)
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయము నిచ్చితివి
ఆవేదనల అగ్ని జ్వాలలో అండగ నిలిచితివి ఆలోచనవై
ఆశ్రయ మిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా (2) " నీవే "
సర్వకృపానిధి సీయోను పురవాసి
నీ స్వాస్థ్యముకై నను పిలిచితివి (2)
సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చుదును సహనము కలిగి (2)
శిథిలము కానీ సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వ శక్తిగల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకెనయ్యా (2) " నీవే "
ప్రాకారములను దాటించితివి
ప్రార్ధన వినెడి పావన మూర్తివి (2)
పరిశుద్ధులతో నను నిలిపితివి
నీ కార్యములను నూతన పరచి (2)
పావన మైన జీవన యాత్రలో విజయము నిచ్చితివి
పరమ రాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జాడక స్థిర పరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతం నీకెనయ్యా (2) " నీవే "
Comments