నీతో నా జీవితం - neetho naa jeevitham song lyrics

నీతో నా జీవితం సంతోషమే 
నీతో నా అనుబంధం మధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్య పూర్ణుడవై 
నా యేసయ్య నడిపించు చున్నావు స్ఫూర్తి ప్రధాతవై 
ఆరాధ్యుడా యేసయ్య
నీతో నా అనుబంధం మాధుర్యమే 

భీకర ధ్వని గల మార్గము నందు
నను నడిపించిన నా ప్రియుడవు నీవు (2) 
కలనైన మరువను నీవు నడిపిన మార్గం 
క్షణమైన విడువను నీతో సహవాసం (2) " ఆరాధ్యుడా "

సంతోష మందైన శ్రమల యందైనను 
నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే  (2) 
నిత్యమైన మహిమలో నే నిలుచుటకు 
శుద్ధ సువర్ణముగా నను మార్చితివి (2)  " ఆరాధ్యుడా "

ఆకాశముందుండి ఆశీర్వదించితివి 
అభాగ్యుడనైన నేను కనికరింప బడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు 
నూతన కృపాలతో నను నింపుతున్నావు (2) 
                                                  " ఆరాధ్యుడా " 


 



Comments

Popular Posts