నీ నామమునే ధ్వజముగా - nee namamune dhvajamuga song lyrics

ఏ నామములో సృష్టి అంత సృజించ బడెనో 
ఆ నామమునే స్తుతింతును 
ఏ నామములో పాపమంత క్షమించబడెనో 
ఆ నామము నే పూజింతును 
ఏ నామములో గొల్యాతును ఎదిరించెనో 
ఆ నామమునే నమ్మెదను 
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలిగెనో 
ఆ నామమునే స్మరింతును 

పల్లవి : 
నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను
నీ నామమే ఆధారము 
నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను 
నీ నామమే నా జయము 

రోగము తల వంచును నీ నామము ఎదుట
శాపము తల వంచును నీ నామము ఎదుట (2)
సాటి లేని నామము స్వస్థ పరచే నామము 

ప్రతి మోకాలు వంగును నీ నామము ఎదుట 
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకె ఘనత (2) 
శ్రేష్ఠ మైన  నాముము శక్తి కలిగిన నామము 

హెచ్చింప బడును గాక నీ నామము యేసయ్యా 
కీర్తింప బడును గాక నీ నామము యేసయ్య  
కొనియడ బడును గాక నీ నామము యేసయ్య 
అన్ని నామములకు పై నామముగా 




Comments

Popular Posts