నీ చేతితో నన్ను పట్టుకో - nee chethitho song lyrics
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము
"2"
అంధకార లోయలోన
సంచరించిన భయము లేదు
నీ వాక్యం శక్తి గలది
నా త్రోవకు నిత్య వెలుగు (2)
ఘోర పాపిని నేను తండ్రి
పాప ఊబిలో పడియుంటిని
లెవనెత్తుము శుద్ధి చేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను (2)
ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితంతము సేవ చేసేదన్ (2) " నీ చేతితో "
Comments