నజరేయుడా నా యేసయ్య - najareyuda naa yesayya song lyrics
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైన
ఆరాధ్య దైవము నీవెనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా (2)
ఆకాశ గగణాలను నీ జానతో కొలిచితివి (2)
శూన్యములో ఈభూమిని వ్రేలాడదీసిన నాయేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) " నజరేయుడా "
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలో బడినే వెళ్లినా
నన్నేమి చేయవు నాయేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) " నజరేయుడా "
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనామాయెనా (2)
సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) " నజరేయుడా "
Comments