నా తోడు నీవై - naa thodu neevai song lyrics

నా తోడు నీవై నిలచితివే 
నీ ప్రేమ నాపై చూపితివే (2) 
నను వెంటాడే నీ కృపా క్షేమములే 
నను కాచే నీ కరుణా కటాక్షములే (2) 
యేసయ్యా నీకే స్తోత్రము (4)              " నా తోడు " 

అగ్ని గుండములో సింహపు బోనులో నను 
రక్షించు వా.రెవరును లేక .. నే ఒంటరినై యున్న వేళ 
నిలిచావు నాకై తోడుగా నిలిపావు నన్ను నీదు సాక్షిగా (2)
నను చేశావు రక్షణ కే రుజువు గా .. 
యేసయ్య నీకే స్తోత్రము .. (4)           " నా తోడు " 

అనారోగ్యములో వ్యాధి బాధలలో 
నను స్వస్థ పరచు వారెవరు లేక 
నే వేదనలో కృంగి యున్న వేళా 
తాకావు నన్ను నీ చేతితో 
స్వస్థ పరిచావు నన్ను నీదు వాక్కుతో  (2) 
నను చేశావు ప్రేమతో పరిపూర్ణముగా 
యేసయ్య నీకే స్తోత్రము (4)            "  నా తోడు " 







Comments

Popular Posts