నా నీతి సూర్యుడా - naa neethi suryuda song lyrics

నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య 
సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని (2)
రాజులకే   ... మహా రాజువు 
కృప చూపే ...  దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి (2)

శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను 
వాక్యమే కృపా వాక్యమై నను వీడని అనుబంధమై (2)
నీ మాటలే జల ధారలై సంతృప్తి నిచ్చెను 
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను 
నీ మాటే మధురం ... 
                                                       " రాజులకే "     

మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు 
ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి  (2) 
భీకరమైన కార్యములు చేయుచున్న వాడా 
సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్న వాడా 
ఘన పరతును నిన్నే ... 
                                                     " రాజులకే " 

సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ యెదుట నిలపాలని 
ఆత్మతో మహిమాతతో నను ముద్రించియున్నావు నీవు(2)
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని 
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని 
ఆశతో ఉన్నానయా ... 
                                                     " రాజులకే " 








Comments

Popular Posts