నా నీతి సూర్యుడా - naa neethi suryuda song lyrics
నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య
సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని (2)
రాజులకే ... మహా రాజువు
కృప చూపే ... దేవుడవు
నడిపించే నజరేయుడా - కాపాడే కాపరివి (2)
శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమై నను వీడని అనుబంధమై (2)
నీ మాటలే జల ధారలై సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
నీ మాటే మధురం ...
" రాజులకే "
మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు చేయుచున్న వాడా
సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్న వాడా
ఘన పరతును నిన్నే ...
" రాజులకే "
సంఘమై నీ స్వాస్థ్యమై నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో మహిమాతతో నను ముద్రించియున్నావు నీవు(2)
వరములతో ఫలములతో నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా ...
" రాజులకే "
Comments