మహోన్నతుడా నీ చాటున - mahonnathuda ne chatuna song lyrics
మహోన్నతుడా నీ చాటున - నే నివసించెదను
సర్వ శక్తుడా నీ నీడలో - నే విశ్రమించెదను
బలవంతుడా నీ సన్నిధినే
నే ఆశ్రయించేదా అనుదినము
యేసయ్యా యేసయ్యా (2)
రాత్రి వేళ కలుగు భయముకైనా
పగటిలో ఎగిరే బాణము కైనా
చీకటిలో సంచరించు తెగులుకైనా
దినమెల్ల వేధించే వ్యాధి కైనా
నే భయపడను నే దిగులు చెందను
యెహోవా రాఫా నా తోడు నీవే
యేసయ్యా యేసయ్యా (2)
వెయ్యిమంది నా ప్రక్క పడిపోయిన
పదివేలు నా చుట్టూ కూలినను
అంధకారమే నన్ను చుట్టు ముట్టిన
మరణ భయమే నన్ను వేధించినా
నే భయపడను నే దిగులు చెందను
యెహోవా నిస్సీ నా తోడు నీవే
యేసయ్యా .. యేసయ్యా.. (2)
నిను ప్రేమించువారిని తప్పించువాడా
నిన్నెరిగిన వారిని ఘన పరచువాడా
నా యుద్ధము జయించి లేవనెత్తువాడా
కృప వెంబడి కృప చూపించువాడా
నే భయపడను నే దిగులు చెందను
యెహోవా షాలోమ్ నా తోడు నీవే
Comments