మహదానందమైన నీదు - mahadhanandhamaina needhu sannidhi song lyrics

మహదానందమైన నీదు సన్నిధి 
ఆపత్కాలమందు దాగు  చోటది 
మనవులు అన్నియు ఆలకించిన 
విజయము గల వారికి ఘనత నిచ్చిన 
నీ సింహాసనమును స్థాపించుటకు 
నీవు కోరుకున్న సన్నిధానము 
ఎంత మధురము నీ ప్రేమ మందిరం 
పరవశమే నాకు యేసయ్యా    (2)

విసిగిన హృదయం కలవరమొంది p
వినయము కలిగి నిన్ను చేరగా (2)
పరమందుండి నీవు కరుణ చూపగా 
లేత చిగురుపైన మంచు కురియు రీతిగా 
ప్రేమను చూపి బహువు చాపి 
నీలో నన్ను లీనము చేసిన (2) 
ప్రేమ సాగరా జీవితాంతము 
నీ సన్నిధిని కాచుకుందును (2)     " మహదానందమైన " 

లెక్కించలేని స్థుతులతో నీవు 
శాశ్వత కాలము స్తుతి నొందెదవు (2)
మహామతోనీవు సంచరించగా 
ఏడు దీప స్తంభములకు వెలుగు కలుగగా (2) 
ఉన్నతమైన ప్రత్యక్షతను నే చూచుటకు కృపనిచ్చితివి 
కృపా సాగరా వధువు సంఘమై 
నీ కోసమే వేచియుందును (2)     " మహాదానందమైన "

సీయోను శిఖరమే నీ సింహాసనము
శుద్ధులు నివసించు మహిమ నగరము (2)
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన 
మధురంగా నీ యెదుట నేను పాడనా (2)
సౌందర్యముగా అలంకరించిన 
నగరములోనే  నివసించెదను (2)
ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా 
నీతోనే రాజ్యమేలేద  (2)            " మహాధనందమైన" 





Comments

Popular Posts