మహా మహిమతో - maha mahimatho song lyrics
మహా మహిమతో నింపిన కృపా సత్య సంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రముల పై ఆశీనుడా యేసయ్య
నా స్థుతుల సింహాసనం నీ కోసమే యేసయ్య
" మహా "
మహిమను విడచి భువిపైకి దిగివచ్చి
కరుణతో నను పిలిచి - సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి
సధకుడుడవై నా పాదములు తొట్రిళ్ళనియ్యక
స్థిర పరచి నీ కృప లో నడిపించువాడవు (2)
" మహా "
కరముల చాపి జలరాసులలోనుండి నను లేవ నెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అను దినము కాచితివి
అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు
నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు
" మహా "
పదివేల లోన గుర్తింప దగిన సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు
ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను
రక్షకుడా ప్రభాకరుడా నిను అరాధించెదను
" మహా "
Comments