మధురం మధురం - madhuram madhuram song lyrics

మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం 
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం 
దీన మనస్సు దయగల మాటలు సుందర వదనం 
తేజోమయుని రాజసం (2)                       " మధురం " 

ఆశ్చర్య మైన వెలుగై దిగివచ్చి చీకటిలో ఉన్న వారిని 
బంధింప పడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగి వర్ధిల్ల చేయుటకు 
యేసే సరిపాటి నా యేసే సరి పాటి             " మధురం " 

పరిపూర్ణ మైన నెమ్మదినిచ్చుటకు 
చింతలన్నియు బాపుటకు - ప్రయాస పడు వారి భారము తొలగించుటకు (2)
ప్రతి ఫలము నిచ్చి ప్రగతి లో నింపుటకు 
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)        " మధురం " 

కలవర పరిచే శోధనలేదురైనా - క్రుంగ దీసే భయములైనను  - ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు
దూరమైన (2) 
జడియకు నీవు మహిమలో నిలుపుటకు 
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)        " మధురం " 



Comments

Popular Posts