మధురం మధురం - madhuram madhuram song lyrics
మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం
దీన మనస్సు దయగల మాటలు సుందర వదనం
తేజోమయుని రాజసం (2) " మధురం "
ఆశ్చర్య మైన వెలుగై దిగివచ్చి చీకటిలో ఉన్న వారిని
బంధింప పడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగి వర్ధిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే సరి పాటి " మధురం "
పరిపూర్ణ మైన నెమ్మదినిచ్చుటకు
చింతలన్నియు బాపుటకు - ప్రయాస పడు వారి భారము తొలగించుటకు (2)
ప్రతి ఫలము నిచ్చి ప్రగతి లో నింపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) " మధురం "
కలవర పరిచే శోధనలేదురైనా - క్రుంగ దీసే భయములైనను - ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు
దూరమైన (2)
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2) " మధురం "
Comments