లెక్కించలేని స్తోత్రముల్ - lekkincha leni sthothramul song lyrics

లెక్కించలేని స్తోత్రముల్ 
దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ 
దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్  (2) 
ఇంత వరకు నా బ్రతుకులో (2) 
నీవు చేసిన మేళ్లకై                      " లెక్కించ " 

ఆకాశ మహాకాశముల్  
వాటి యందున్న సర్వంబును (2) 
భూమి లో కనబడున వన్ని (2) 
ప్రభువా నిన్నే కీర్తింతున్              " లెక్కించ " 

అడవిలో నివసించునవన్నీ 
సుడి గాలి మంచును  (2) 
భూమిపై నున్నవన్నీ (2) 
దేవా నిన్నే పొగడును                 " లెక్కించ " 

 నీటిలో నివసించు ప్రాణుల్ 
ఈ భువిలో జీవరాసులు (2) 
ఆకాశమున ఎగురున వన్నీ (2) 
ప్రభువా నిన్నే కీర్తింతున్             " లెక్కించ " 

Comments

Popular Posts