కృపా క్షేమము - krupaakshemamu song lyrics

కృపా క్షేమము నీ శాశ్వత జీవము 
నా జీవిత కాలమంతయు నీవు దయచేయు వాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు 
తలంచుచు అనుక్షణము పరవసించనా 
నీ కృప లొనే పరవసించనా (2) 

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే 
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే 
కడలిని మించిన విశ్వాసము నిచ్చి విజయము చేకూర్చెను
నీ వాక్యమే మకారంధమై బలపరచెను నన్ను 
నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే (2)
ఆరాధన నీకె                                   " కృపా క్షేమము "

 
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే 
పరిమలింప చేసి సాక్షి గా నిలిపాయి (2) 
కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే 
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృప నిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిశక్తుడా ఆరాధన నీకే 
ఆరాధ్యుడా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే (2) 
ఆరాధన నీకే                                   " కృపా క్షేమము "

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహా రాజా 
నా హృది నీ కొరకు పదిల పరచితిని (2)
బూర శ్శబ్దము వినగా నా బ్రతుకులో కలల పండుగ 
అవధులు లేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిశక్తుడా ఆరాధన నీకే 
ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే (2) 
ఆరాధన నీకే                                  " కృపా క్షేమము " 




Comments

Popular Posts