కృపా కృపా సజీవులతో - krupa krupa sajeevulatho song lyrics

కృపా కృపా సజీవులతో నిలిపినది నీ కృపా 
నా శ్రమ దినమున నాతో నిలిచి 
నను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా 
కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా (2)

శాశ్వతమైన నీ ప్రేమ తో నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షిగా నే 
నీ దివ్య సన్నిధిలో నన్నొదిగి పోనీ        (2) 
నీ ఉపదేశమే నాలో ఫల భరితమై 
నీ కమనీయ కాంతులను విరరజిమ్మీనే 
నీ మహిమను ప్రకటింప నను నిలిపేనే     " కృపా " 

గాలి తుఫానుల అలజడిలో 
గూడు చెదరిన గువ్వవలే 
గమ్యమును చూపే నిను వేడు కొనగా 
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2) 
నీ వాత్సల్యమే నవ వసంతము 
నా జీవిత దినములు ఆధ్యంతము (2) 
ఒక క్షణమైనా విడువని ఆధ్యంతము       " కృపా " 

అత్యున్నతమైన కృపలతో 
ఆత్మ ఫలముల సంపదతో 
అతి శ్రేష్ఠ మైన స్వాస్థ్యమును పొంది 
నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళా (2) 
నా హృదయార్పణ నిన్ను మురిపించని 
నీ గుణాతి శయములను కీర్తించని (2)
ఈ నిరీక్షణ నాలో నెరవేరని                  " కృపా "




Comments

Popular Posts