కొండల తట్టు నా కనులెత్తి - kondala thattu song lyrics

Verse 1 : 
కొండల తట్టు నా కనులెత్తి 
చూచున్నాను నీ వైపు 
కరములు చాపి నీ వాగ్ధానముకై 
వేచియున్నాను నీ ముందు 

Chorus : 
నా సహాయకుడా నా సమర్థుడా 
నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా 

కునుకవు నీవు నిదురించవు 
నిరతము నా మొరలను ఆలకింతువు 

Verse 2 : 
నీ కార్యములు ఆశ్చర్యములు 
నీ యోచనలు మహానీయము 
రుచి చూచితిని నా బాల్యము నుండి 
సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో     " నా సహా " 

కునుకవు నీవు నిదురించవు 
నిరతము నా మొరలను ఆలకింతువు 
కునుకవు నీవు నిదురించవు 
నిత్య నిబంధన స్థిర పరచెదవు 

నీటిని చీల్చి మార్గము చూపి 
ఆరిన నేలపై నడిపిన దేవా 
అగ్నిలో చేరి తోడుగా నడచి 
సజీవ సాక్షిగా నిలిపిన దేవా 

పర్వతములను తొలగించుము 
నీ వాగ్దానమును నెర వేర్చుము            " నా సహా " 





.

.

Comments

Popular Posts