కరుణా సంపన్నుడా - karuna sampannuda song lyrics

కరుణా సంపన్నుడా - ధీరుడా సుకుమారుడా 
నీ ప్రభావ మహిమలనే - నిరంతరం నేను ప్రకటించేదా
నా పైన ప్రేమ చూపించి - నా కొరకు త్యాగమైతివే 
నా యేసయ్య సాత్వికుడా - నీకోసమే నా జీవితం 

ఏనాడు నను వీడని - నీ ప్రేమ సందేశం 
నా హృదయ సీమలోనే సందడిని చేసేనే 
అనువణువును బలపరిచే నీ జీవపు వాక్యమే  
ప్రతి క్షణము దరిచేరి నన్నే తాకేను 
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింప చెసి నన్నే నడిపించెను 
                                                   " కరుణా " 

ఈ వింత లోకం లో - నీ చెంత చేరితిని 
ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని 
నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే
అనుదినము మకారందమే నీ స్నేహ బంధము 
ఆ ప్రేమ లొనే కడవరకు నన్ను 
నడిపించుమా - స్థిర పరచుమా      " కరుణా " 

నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై 
నాకున్న ఈ నిరీక్షనే సన్నిధిలో నిలిపినది 
నాకోసం నిర్మించే సౌందర్య నగరములో 
ప్రణమిల్లి చేసెదను నీ పాదాభి వందనం 
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడేద 
                                                  " కరుణా "

Comments

Popular Posts