జుంటె తేనె కన్నా - junte thene kanna song lyrics

జుంటె తేనె కన్నా తీయనిది 
వెండి పసిడి కన్నా మిన్న అది 
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది 
యేసు నీ నామము 

సూర్యకాంతికన్నా ప్రకాశమైనది 
పండు వెన్నెల కన్నా  నిర్మలమైనది 
మంచు కొండలకన్నా చల్లనిది 
యేసు నీ నామము     

యేసు అసాధ్యుడవు నీవు 
మరణాన్నే జయించిన వీరుడవు 
సర్వాన్ని శాసించే యోధుడవు 
నీకు సాటి లేరెవరు 
రక్షకా నీవేగా నా బలము 
దేవా మా దాగు స్థలము నీవే 
నీవే నిజమైన దేవుడవు 
ప్రణమిల్లి మ్రొక్కెదము (2)               " జుంటె " 

ఆకాశము కన్నా విశాలమైనది
విశ్వమంతటిలో  వ్యాపించి యున్నది 
ఉహాలకందని ఉన్నతమైనది 
యేసు నీ నామము        

లోకమంతటికి రక్షణ మార్గము 
జనులందరిని బ్రతికించు జీవము 
సర్వ కాలములలో  నివసించు సత్యము 
యేసు నీ నామము                        " జుంటె " 

Comments

Popular Posts