ఘనమైనవి నీ కార్యములు - ghanamainavi nee karyamulu song lyrics

ఘనమైనవి నీ కార్యములు నా యెడల 
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య 
కృపలను పొందుచు కృతజ్ఞాత 
కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా 
అనుదినము నీ అనుగ్రహమే - ఆయుష్కాలము నీ వరమే
                                                     " ఘనమైనవి " 

ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరిచేరణీయక 
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) 
నా భారము బాపి బాసటగా నిలిచి ఆదరించితివి 
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము (2)
                                                    " ఘనమైనవి " 

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే 
ఆశ్రయమైనబండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే (2)
నా ప్రతి క్షణమును నీవు దీవెనెగా మార్చి నడిపించుచున్నావు - ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితంతము   (2)      " ఘనమైనవి " 

నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా - బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా ఎడ చాలున్నంటివే (2)
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువ 
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము (2)
                                                   "ఘనమైనవి " 


Comments

Popular Posts