దీనుడా అజేయుడా - deenuda ajeyuda song lyrics

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా 
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా 
జీవ దాతవు నీవని శృతి మించి పాడనా 
జీవ ధారము నీవని కానుకనై పూజించనా (2) 
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే 
స్వరార్చన చేసేద నీకే నా స్థితులర్పించెద నీకే  " దీనుడా "

సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా 
గమనము లేని పోరాటాలే తరుముచుండగా 
నిరుపేదనైన నా యెడల సందేహమేమి లేకుండా 
హేతువే లేని ప్రేమ చూపించి  సిలువ చాటునే దాచావు (2)

సంతోషం నీవే అమృత సంగీతం నీవే 
స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే      " దీనుడా " 

సత్య ప్రమాణము నెర వేర్చుటకు మార్గ దర్శివై 
నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా 
విరిగి నలిగిన మనస్సుతో  హృదగార్చనే చేసేద 
కరుణ నీడలో కృపా వాడలో నీతో ఉంటే చాలయ్యా (2)

కర్తవ్యం నీవే కనుల పండుగ నీవే గా
విశ్వాసం నీవే  విజయ శిఖరము నీవేగా  " దీనుడా " 

ఊహకందని ఉన్నతమైనది దివ్య నగరమే
స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే 
ఆ నగరమే లక్ష్య మై మహిమాత్మతో నింపినావు 
అమర లోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడేదను (2)

ఉత్సాహం నీవే నాయనోత్సవం నీవేగా 
ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా 
                                                          " దీనుడా " 






      


 

Comments

Popular Posts