చింతలేదిక యేసు పుట్టెను - chintha ledhika yesu puttanu song lyrics
చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహమందున
చెంతజేరను రండి సర్వజనాంగమ సంతసమొందుమా (2)
దూత దెల్పేను గొల్లలకు శుభవార్త నా దినసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి స్తుతులొన రించిరి
" చింత లేదిక "
చుక్కకనుగొని జ్ఞానులెంతో మక్కువతో నాప్రభుని గనుగొని
చక్కగా బేత్లెహేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి
" చింత లేదిక "
కన్యగర్భము నందు పుట్టెను కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై
" చింత లేదిక "
పాప మెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను
దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము
" చింత లేదిక "
Comments