ఎవరు చూపించలేని - evaru chupinchaleni song lyrics

ఎవరు చూపించలేని  ఇలలో నను వీడి పోనీ 
ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది 
మరువను యేసయ్యా ..         
నీ కథే నన్నే తాకగా     నా మదే నన్నే చేరగా        
నా గురే నీవై యుండగా నీ దరే నే చేరానుగా    

తీరాలే దూరమాయే   కాలాలే మారిపోయే  
ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే 
నా గుండె లోతులోన నే నలిగిపోతు ఉన్నా 
ఏ దారి కానరాక నీ కొరకు వేచియున్నా 
ఎడబాటు లేని గమనాన నిను చేరుకున్న సమయాన  
నను ఆదరించె ఘాన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ 
ఏకమై తోడుగా  ఊపిరే నీవుగా  
ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా             " ఎవరు " 

ఈ లోక జీవుతానా వేసారిపోతూఉన్న  
విలువైన నీదు వాక్యం  వెలిగించే నా ప్రాణం 
నీ సన్నిధానమందు సీయోను మార్గమందు 
నీ దివ్య సేవ లొనే నడిపించే నా ప్రభు  
నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైనా 
నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన 
శాశ్వత ప్రేమతో సత్య వాక్యంబుతో 
నిత్యము తోడుగా నిలిచే నా యేసయ్య        " ఎవరు " 
 

Comments

Popular Posts