అత్యున్నత సింహాసనము పై - athyunnatha simhasanamupai song lyrics

అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా 
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్య 
నా నిలువెళ్ల నిండియున్నావు - నా మనసారా నీ సన్నిధిలో
సాగిల పడి నమస్కారము చేసేద (2) 

ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నియు
నీ మహిమను వివరించునే  (2) 
ప్రభువా నిన్నే అరాధించెద కృతజ్ఞతార్పణలతో 
కృతజ్ఞతార్పణలతో (2)                       " అత్యున్నత " 


పరిమలించునే నా సాక్ష్య జీవితమే 
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునా (2)
పరిశుద్ధాత్మతో ఆనందించెద 
హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో (2)   " అత్యున్నత "

పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి (2) 
యెహోవా నిన్నే మహిమ పరచెద 
స్తుతి గీతాలతో స్తుతి గీతలతో (2)      "అత్యున్నత " 



Comments

Popular Posts