అత్యున్నత సింహాసనము పై - athyunnatha simhasanamupai song lyrics
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్య
నా నిలువెళ్ల నిండియున్నావు - నా మనసారా నీ సన్నిధిలో
సాగిల పడి నమస్కారము చేసేద (2)
ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నియు
నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే అరాధించెద కృతజ్ఞతార్పణలతో
కృతజ్ఞతార్పణలతో (2) " అత్యున్నత "
పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందునా (2)
పరిశుద్ధాత్మతో ఆనందించెద
హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో (2) " అత్యున్నత "
పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివి (2)
యెహోవా నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో స్తుతి గీతలతో (2) "అత్యున్నత "
Comments