అతి సుందరుడవు యేసయ్య - athi sundharudavu song lyrics

అతి సుందరుడవు యేసయ్యా 
మనోహరుడవు నీవయ్యా 
యదార్ధ వంతుల సభలో - పరిశుద్దులతో కలిసి 
నిను అరాధించెదను .... (2) 
అతి సుందరుడా మనోహరుడా .. 
ఆరాధనకు యోగ్యుడవు .. స్థుతులకు పాత్రుడవు .. (2)

నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు 
కృపా క్షేమములు నీ మందిరములో సమృద్ధిగా గలదు
నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించేదను 
పరవశించి పరవళ్లు తొక్కి ఆరాధించేదను (2)
                                               " అతి సుందరుడవు " 

అమూల్యములైన వాగ్దానములు నాకై అనుగ్రహించావు 
అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించి యున్నావు 
విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమును పొందెదను 
సంపూర్ణతకై పరిశు ద్ధుడనై అరాధించెదను (2) 
                                               " అతి సుందరుడవు " 

మహా రాజువై సీయోనులో యేలుచున్నావు 
పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు 
సౌందర్యము గల సీయోనులో ప్రకాశించు చున్నావు 
నీ మహిమను పొంది నీ దరి చేరి అరాధించెదను (2) 

అతి సుందరుడా మనోహరుడా 
ఆరాధనకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు (2) 

                                               " అతి సుందరుదవు " 


Comments

Popular Posts