అందాలతార అరుదించే - andaala thara arudhenche song lyrics

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో 
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ 
ఆనంద సంద్ర ముప్పొంగే నాలో అమర కాంతిలో 
ఆది దేవుని జూడ ఆశించే మనసు పయణమైతిని 
                                                  " అందాల " 

విశ్వాస యాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించే నాలో విజయ పథమున 
విశ్వాలలేనేడి దేవ కుమారుని వీక్షించు దీక్షలో 
విరజిమ్మే బలము  ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసఁగుచున్ 
                                                 " అందాల " 

యెరూషలేము రాజా నగరిలో యేసుని వెదకుచూ 
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి 
యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురాయే త్రోవలో 
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు 
ఏగితి స్వామి కడకు                    " అందాల " 

ప్రభు జన్మ స్థలము పాకయే గాని పరలోక సౌధమే
బాలుని జూడా జీవితమెంత పావన మాయెను 
ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము 
బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయె 
ఫలియించే ప్రార్ధన                      " అందాల " 

Comments

Popular Posts