ఆనందమే పరమానందమే - anandhame paramanandhame song lyrics
ఆనందమే పరమానందమే
ఆశ్రయ పురమైన యేసయ్య నీలో (2)
ఆపత్కాలము లన్నింటిలో
ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము (2)
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివి
జీవ జలములు త్రాగ నిచ్చితివి (2)
నా ప్రాణమును సేద దీర్చితివే
నీతియు శాంతియు నాకిచ్చితివే (2) " ఆనందమే "
గాఢాంధ కారపు లోయలలో నేను
సంచరించిన దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2) " ఆనందమే "
నా శత్రువుల ఎదుటే నీవే
నాకు విందును సిద్ధము చేసితివి (2)
నీతో నేను నెస్ మందిరములో
నివాసము చేసేద సదకాలము (2) " ఆనందమే "
Comments