ఆనందం నీలోనే - anandham neelone song lyrics

ఆనందం నీలోనే ఆధారం నీవే గా 
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా (2) 
అర్హతే లేని నన్ను ప్రేమించి నావు 
జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్ధమై    " ఆనందం " 

పదే పదే నిన్నే చేరగా - ప్రతి క్షణం నేవే ధ్యాసగా (2) 
కలవరాల తోటలో కన్నీటి బాటలో (2) 
కాపాడే కవచముగా నన్ను ఆధరించిన 
దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా (2)           " ఆనందం " 

నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యము నీవని (2)
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా (2)
నీకొరకె ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా 
సత్య వాక్యమే జీవ వాక్యమై (2)         " ఆనందం " 

సర్వ సత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నాప్రాణమై (2) 
లోక మహిమ చూడక నీ జాడను వీడక (2)
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో 
నీ దర్శనం  నా ఆశయం                     " ఆనందం " 


Comments

Popular Posts