ఆనందం నీలోనే - anandham neelone song lyrics
ఆనందం నీలోనే ఆధారం నీవే గా
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా (2)
అర్హతే లేని నన్ను ప్రేమించి నావు
జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్ధమై " ఆనందం "
పదే పదే నిన్నే చేరగా - ప్రతి క్షణం నేవే ధ్యాసగా (2)
కలవరాల తోటలో కన్నీటి బాటలో (2)
కాపాడే కవచముగా నన్ను ఆధరించిన
దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా (2) " ఆనందం "
నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యము నీవని (2)
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా (2)
నీకొరకె ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా
సత్య వాక్యమే జీవ వాక్యమై (2) " ఆనందం "
సర్వ సత్యమే నా మార్గమై సంఘ క్షేమమే నాప్రాణమై (2)
లోక మహిమ చూడక నీ జాడను వీడక (2)
నీతోనే నిలవాలి - నిత్య సీయోనులో
నీ దర్శనం నా ఆశయం " ఆనందం "
Comments