అలరారు ఆ దివ్య - alararu aa divya song lyrics
అలరారు ఆ దివ్య రూపం
పశు శాలలో వెలిగే దీపం
పరిహరింపను మానవ పాపం
ప్రభావించెను ఇలలో ఆనందం " అలరారు "
ప్రకృతియే పరవశించి ఆడే
పరలోక సైన్యాలు పాడే
భక్తితో ఆ బాలుని వేడ
చూపించే ఒక తార జాడ " అలరారు "
జగతిలోన మానవులను జూచే
బాల యేసు రూపము దాల్చే
గొల్లలే సేవింప రాగా
ప్రాణమిల్లు ఈ దినమే వేగ " అలరారు "
Comments